Mahaa Daily Exclusive

  ఓటేయ్యకుంటే నిధులు ఇవ్వ:మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌

Share

  • ఓటేయ్యకుంటే నిధులు ఇవ్వ
  • మీ దగ్గర ఓట్లు ఉన్నాయి.. నా దగ్గర నిధులు ఉన్నాయి
  • మీరు తిరస్కరిస్తే.. నేను కూడా తిరస్కరిస్తా
  • మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ సంచలన కామెంట్స్

మహారాష్ట్ర, మహా: ఓటర్లను ఉద్దేశించి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను తిరస్కరిస్తే.. నిధుల కేటాయింపు విషయంలో తానూ అదే పనిచేస్తానని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బారామతిలో నిర్వహించిన ప్రచారంలో ఆయన ఈమేరకు ప్రసంగించారు. ‘స్థానికంగా ఎన్సీపీకి చెందిన 18 మంది అభ్యర్థులను గెలిపిస్తే.. ఈ ప్రాంత అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూస్తాను. హామీలను నెరవేర్చే విషయానికి కట్టుబడి ఉన్నాను. మీ దగ్గర ఓట్లు ఉన్నాయి. నా దగ్గర నిధులు ఉన్నాయి. మీరు తిరస్కరిస్తే.. నేను కూడా తిరస్కరిస్తా’’ అని అజిత్‌పవార్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా ఆయనే కావడం గమనార్హం. అజిత్ పవార్‌వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆయన ఓటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించాయి. ‘‘నిధులు అనేవి సామాన్య ప్రజలు కట్టిన పన్నుల నుంచి విడుదల చేస్తుంటారు. అజిత్‌పవార్‌ఇంటి నుంచి ఇవ్వరు. ఆయన ఓటర్లను బెదిరిస్తుంటే.. ఎన్నికల సంఘం ఏం చేస్తోంది?’’ అని శివసేన (యూబీటీ) నేత అంబాదాస్‌ధన్వే ప్రశ్నించారు.

Latest