Mahaa Daily Exclusive

  ఆ అధ్యక్షుడిని మార్చండి: కుటుంబంపై పున్నా కైలాశ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి ఘాటు లేఖ

Share

ఆ అధ్యక్షుడిని మార్చండి!
సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి ఘాటు లేఖ
కుటుంబం పట్ల పున్నా కైలాశ్ తీవ్ర పదజాలం ఉపయోగించారన్న మంత్రి

నల్గొండ, మహా: జిల్లా కాంగ్రెస్‌లో డీసీసీ పదవి చుట్టూ రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇటీవల డీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన పున్నా కైలాష్ నేత నియామకంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పార్టీ అంతర్గతంగా కలహాలు మొదలయ్యాయి. పున్నా కైలాష్ తనపై, తన కుటుంబంపై అసభ్య పదజాలంతో మీడియా ముందు మాట్లాడాడని ఆరోపించిన మంత్రి కోమటిరెడ్డి.. అలాంటి వ్యక్తికి డీసీసీ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. డీసీసీ పదవి నుంచి అతన్ని తొలగించి, అర్హులైన నాయకుడికి ఆ బాధ్యతలు అప్పగించాలని ఆయన సూచించారు. అంతేకాక, పున్నా కైలాష్‌పై పోలీసు కేసు నమోదు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి లేఖ రాసినట్లు సమాచారం. మరోవైపు, కాంగ్రెస్‌లోని బీసీ వర్గాలు మాత్రం కోమటిరెడ్డి వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఒక బీసీ నాయకుడు జిల్లా అధ్యక్షుడిగా ఎదగడాన్ని కోమటిరెడ్డి సహించలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎంపై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి తమ్ముడిని ముందుగా ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని బీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

Latest