Mahaa Daily Exclusive

  విద్యార్థులకు గుడ్‌న్యూస్..

Share

  • విద్యార్థులకు గుడ్‌న్యూస్
  • విదేశీ విద్యకు బీసీ స్టడీ సర్కిల్ కొత్త అడుగు
  • స్కాలర్‌షిప్‌లు, ఐఈఎల్టీఎస్ శిక్షణ కోసం దరఖాస్తులు ప్రారంభం

హైదరాబాద్, మహా: తెలంగాణ రాష్ట్రంలోని బీసీ, ఇతర విద్యార్థులకు విదేశాలలో ఉన్న అత్యున్నత విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గల అవకాశాలను మరియు అంతర్జాతీయ స్కాలర్‌షిప్పులు పొందడం లక్ష్యంగా తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణాత్మక అవగాహన సెషన్లు, శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిల్స్ విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గల అవకాశాలను వివరించేందుకు అవగాహన కార్యక్రమాలను ఐఈఎల్టీఎస్ శిక్షణ తరగతులను ప్రారంభిస్తాయి. ఈ అవగాహన కార్యక్రమాలకు ఐఈఎల్టీఎస్ శిక్షణ తరగతులకు హాజరు కావడానికి ఆసక్తి ఉన్న గ్రాడ్యుయేషన్ (ప్రొఫెషనల్ మరియు నాన్ ప్రొఫెషనల్) ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు 01. 12. 2025 నుండి 21. 12. 2025 తేదీ వరకు టి. జి. బి. సి. స్టడీ సర్కిల్ వెబ్సైట్ tgbcstudycircle.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం Ph.No.040-24071178 నెంబర్‌ను సంప్రదించవచ్చని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

Latest