Mahaa Daily Exclusive

  రైతులకు రాయితీపై రూ.3 లక్షలు ప్రకటించిన చంద్రబాబు..

Share

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి పనులతోపాటు సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. తాజాగా రైతులకు రాయితీపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2014 నుంచి 2019 మధ్య పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూక్ష్మ సేద్య పథకానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. కంపెనీలతో మాట్లాడి అవసరమైన పరికరాలను రాయితీలపై రైతులకు అందివ్వడంతోపాటు కేంద్రం నుంచి కూడా అవసరమైన రాయితీ వచ్చేలా చూశారు. తాజాగా మరోసారి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఇందులో రాయితీని రూ.3 లక్షలకు పైగా పొందొచ్చు.

 

శ్రీకాకుళంలో 2400 హెక్టార్లలో

ఇప్పటికే రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ పథకం అమలవుతుండగా తాజాగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2400 హెక్టార్లలో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. రైతులకు రాయితీ కింద రూ.11.17 కోట్లను అందిస్తున్నారు. కేంద్రం నుంచి 60 నిధులు వస్తుండగా, రాష్ట్రం 40 శాతం నిధులు సమకూరుస్తోంది. పత్తి, మిరప, మొక్కజొన్న, జీడి మామిడి, మామిడి, జామ, ఆయిల్ ఫాం, కొబ్బరి, కూరగాయలు ఐదు ఎకరాల్లోపు పొలం ఉన్న సన్న చిన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై రూ.2.18 లక్షలను అందించనున్నారు (తుంపర సేదంలో 55 శాతం రాయితీ). ఐదు నుంచి పన్నెండున్నర ఎకరాల భూమి ఉంటే రూ.3.10 లక్షలను 50 శాతం రాయితీపై అందిస్తారు (తుంపర సేద్యంలో 45 శాతం రాయితీ).

 

మండల ఉద్యాన శాఖాధికారి కార్యాలయంలో..

రాయితీపై అవసరమైన పరికరాలను పొందేందుకు రైతులు భూమి యాజమాన్య హక్కులకు సంబంధించిన పత్రాలతోపాటు ఆధార్ కార్డును జతచేసి రైతు సేవా కేంద్రాలకు లేదంటే జిల్లా మైక్రో ఇరిగేషన్ కార్యాలయం లేదంటే మండల ఉద్యాన శాఖాధికారి కార్యాలయంలో బయోమెట్రిక్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలి. బోర్లు, బావుల కింద వ్యవసాయం చేసేవారికి ఈ పథకం బాగా ఉపయోగడపడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.