- మరోసారి పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి
- మూడవసారి కస్టడీ విచారాణ
- అనుమతించిన కోర్ట్
హైదరాబాద్, మహా: పైరసీ కేసులో పట్టుబడి రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్న ఐబొమ్మ రవిని మరోసారి పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది.. ఇప్పటికే రవిని కోర్టు అనుమతితో రెండు సార్లు కస్టడీకి తీసుకున్న పోలీసులు మొత్తం ఎనిమిది రోజులపాటు విచారించారు.. నాలుగు వేరు వేరు కేసులు నమోదయ్యాయి.. రవి నుండి తెలుసుకోవాల్సిన విషయాలు.. సేకరించాల్సిన ఆధారాలు ఇంకా ఉన్నాయని.. మరోసారి రవిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు అభ్యర్థించడంతో మరో మూడు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.. ఈ మూడు రోజులు కలిపితే మొత్తం పదకొండు రోజులు విచారించినట్లు అవుతుంది.
మరోవైపు రవి బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది.. కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో బెయిల్ విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.
కోర్టు నుండి అనుమతి వచ్చిన నేపథ్యంలో రేపు ఉదయం రవిని చంచల్ గూడ జైలు నుండి పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు..!
…..






