Mahaa Daily Exclusive

  సీబీఎస్ఈ తరహాలో పది, ఇంటర్‌కు ఒకే బోర్డ్…

Share

  • సీబీఎస్ఈ తరహాలో పది, ఇంటర్‌కు ఒకే బోర్డ్
  • ఇక 1 నుంచి 12వ తరగతి వరకు ఒకటే
  • తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు

హైదరాబాద్, మహా : తెలంగాణ పాఠశాల విద్యలో అతిపెద్ద మార్పులు రానున్నాయి. ఇప్పటిదాకా పదో తరగతి వరకు ఉన్న ఎస్ఎస్‌సీ బోర్డు, ఇంటర్ వరకు ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు రెండు కలిసి పోనున్నాయి. ఈ మేరకు 1 నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఏర్పాటు కానుంది. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047లో ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రస్తుతం ఉన్న సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ బోర్డులను ఒకే అధికారంతో భర్తీ చేయడం ద్వారా తెలంగాణ తన పాఠశాల విద్యా వ్యవస్థను పునర్నిర్మించనుంది. కొత్త బోర్డు అన్ని వర్గాల పాఠశాలలకు విద్యా ప్రమాణాలు, నాణ్యతా నిబంధనలు, గుర్తింపును నిర్వహిస్తుందని ప్రభుత్వం తెలిపింది. డ్యూయల్-బోర్డు వ్యవస్థ నుండి వైదొలగాలని కేంద్రం రాష్ట్రాలకు చెబుతోంది. ప్రాథమిక, యూపీఎస్, ఉన్నత పాఠశాలలు వంటి ఒకే ప్రాంతంలో పనిచేసే పాఠశాలలు ఒకే ప్రధానోపాధ్యాయుడి కింద ఒకే సంస్థలో విలీనం అవుతాయి. ఈ ఏకీకృత పాఠశాలలు అన్నమాట ప్రీ-ప్రైమరీ నుండి 10వ తరగతి వరకు తరగతులను అందిస్తాయి. హైస్కూల్‌గా మారుతుంది. విలీనం ముందు విద్యార్థులకు తగిన ప్రత్యామ్నాయాలు అందిస్తారు. దీని ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది. ఒకే ప్రాంతం, ఒతే ప్రదేశంలో ఉన్న వివిధ పాఠశాలలు ఒకే గొడుగు కిందకు వస్తాయి.

ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో దశలవారీగా ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రవేశపెడుతుంది. సరిపడా ఉపాధ్యాయులను కూడా అందిస్తుంది. కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్, వయస్సుకు తగిన ఏఐ అక్షరాస్యతతో పాటు పాఠశాల స్థాయి నుండి వృత్తి విద్యను ఏకీకృతం చేయాలని రాష్ట్రం యోచిస్తోంది. పరీక్షా వ్యవస్థ, అభ్యాస అంచనా పద్ధతులను కూడా పునఃరూపకల్పన చేస్తారు. విద్యా ప్రమాణాలను నియంత్రించడానికి తెలంగాణ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ (టీజీఎస్ఎస్ఏ) ఏర్పాటు చేస్తారు. విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తిని చూస్తారు. దీని ఆధారంగా అవసరమైన చోట ఉపాధ్యాయులను పోస్ట్ చేస్తారు. జిల్లా, మండల స్థాయి సమీక్షలు ప్రతి సంవత్సరం ఉంటాయి. టెక్నాలజీ ద్వారా ట్రాన్స్‌ఫర్ రిపోర్ట్ తయారు అవుతుంది. నియామకాలు కోర్ సబ్జెక్టులు, ఆర్ట్స్, శారీరక విద్య, కౌన్సెలింగ్ వంటి అనుబంధ రంగాలను కవర్ చేస్తాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా పీహెచ్‌డీ అర్హత ఉంటే వారిని ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ కళాశాలలలో కూడా నియమించవచ్చు.

ప్రభుత్వ డైట్ కళాశాలలను కొత్త ప్రీ-ప్రైమరీ ఉపాధ్యాయులు, ఇన్-సర్వీస్ సిబ్బంది కోసం కోర్సులను అందించే విద్యా కేంద్రాలుగా మారుస్తారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నెట్‌వర్క్‌లను ప్రభుత్వం మరింత క్రీయాశిలకంగా చేయనుంది. దీనిద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి పెడుతుంది. అంతేకాదు ఎన్ఆర్ఐలను కూడా ఇందులో భాగం చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనితో పాటు విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించే విధానాలు, ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి అనేక మార్పులు చేయనున్నారు.

ఒకే ప్రాంగణం, ప్రాంతంలో వేర్వేరు బడులుంటే.. వాటన్నింటిని ఒకటిగా చేసి.. ఒకే హెచ్ఎం ఆధ్వర్యంలో పని చేసేలా చేస్తారు. ఇలా విలీనం చేయడానికి ముందు విద్యార్థులకు సరైన ప్రత్యామ్నాయం చూపిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ క్లాసులను ప్రవేశపెడతారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు ఉండేలా చర్యలు చేపడతారు. పాఠశాల విద్య నుంచే వృత్తి విద్య బోధించేలా అనుసంధానం చేస్తారు.
కోడింగ్, వయసుకు తగిన ఏఐ లిట్రసీ, కంప్యూటేషనల్‌ థింకింగ్‌ను సిలబస్‌లో చేరుస్తారు.
‘సీఎస్‌ఆర్‌’ను క్రియాశీలకంగా మారుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలతో ఒక నెట్‌వర్క్‌ ఏర్పాటుచేసి స్కూళ్ల బలోపేతానికి విరాళాలు పొందే ఏర్పాటు చేస్తారు.
ప్రభుత్వ డైట్‌ కాలేజీలను అకడమిక్‌ హబ్‌లుగా మారుస్తారు. స్కూళ్లను అన్ని వసతులతో కూడిన ప్రజోపయోగ స్థలాలుగా మారుస్తారు. స్కూల్‌ కాంప్లెక్స్‌లకు బాధ్యత అప్పగిస్తారు.

Latest