Mahaa Daily Exclusive

  తెలంగాణ టెట్ అభ్యర్థులు అలర్ట్ 27న హాల్ టికెట్లు విడుదల…

Share

 

తెలంగాణ టెట్ – 2026 హాల్ టికెట్లపై అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 27వ తేదీన హాల్ టికెట్లు విడదలవుతాయి. https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. జనవరి 3వ తేదీ నుంచి పరీక్షలు జరుగుతాయి. టీజీ టెట్ – 2026 దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈసారి గతంతో పోల్చితే భారీగా దరఖాస్తులు వచ్చాయి. పేపర్‌1, 2, కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులున్నారు.

జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు

వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు తెలంగాణ టెట్ పరీక్షలు జరుగుతాయి. టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. తెలంగాణ టెట్ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. టెట్ ఎగ్జామ్ లో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుందని నిబంధనలు విధించారు.

Latest