- బాలయ్యకు భారీ షాక్
- అఖండ2 టికెట్ల పెంపు సర్క్యులర్‌ను రద్దు చేసిన హైకోర్టు
- లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు
- విచారణ నేటికి వాయిదా
హైదరాబాద, మహా : సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన నటించిన అఖండ-2 టికెట్ రేట్లు పెంచుతూ ఇచ్చిన సర్క్యులర్‌ను హైకోర్టు గురువారం రద్దు చేసింది. ప్రీమియర్ షో సహా టికెట్ ధరల పెంపు సర్క్యులర్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఈ క్రమంలో హోంశాఖ, 14 రీల్స్ ప్లస్‌కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎఫ్టీడీడీ కార్పొరేషన్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అఖండ 2 టికెట్ల ధర పెంపుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది శ్రీనివాస్‌రెడ్డి పిటిషన్‌ను వేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌కు అనుమతించి న్యాయస్థానం విచారణ చేపట్టింది. టికెట్ల ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై విచారణ చేపట్టింది. జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌కుమార్ ఈ లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. ఇలాంటి మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారని హోంశాఖ జీపీని ప్రశ్నించింది. ఇప్పటికే టికెట్ ధరల విషయంలో ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది కదా అని ప్రశ్నించింది. టికెట్ ధరలు పెంచుతూ మెమోలు జారీ చేయడం కోర్టు ధిక్కరణ కాదా అని అడిగింది.
టికెట్ ధరల విషయంలో ఏం జరుగుతుందని హోంశాఖ జీపీని హైకోర్టు నిలదీసింది. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని జీపిని హైకోర్టు మరోసారి ప్రశ్నించింది. ప్రతి సినిమాకు ఇదే విధంగా ధరలు పెంచుకుంటూ సర్క్యులర్ జారీ చేస్తున్నారని ఆగ్రహించింది. హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హోంశాఖ స్పెషల్ సీఎస్‌గా కొత్త వ్యక్తి వచ్చారని కోర్టు ఆదేశాలపై పూర్తి అవగాహన లేదని జీపీ తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు అఖండ2 కోసం ఇచ్చిన సర్కులర్‌ను రద్దు చేసింది. ప్రీమియర్ షోతో పాటు టికెట్ ధరలను పెంచుతూ జారీ చేసిన జీవోను రద్దు చేసింది. ఈ క్రమంలో హోంశాఖ, 14 రీల్స్ ప్లస్, ఫిలిం టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
అఖండ 2 చిత్రం ప్రీమియర్ షోకు అనుమతిస్తూ బుధవారం హోంశాఖ సర్క్యులర్‌ను జారీ చేసింది. గురువారం రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోకు రూ.600 టికెట్ ధరను నిర్ణయించింది. శుక్రవారం నుంచి సింగిల్ స్క్రీన్కు రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లకు రూ.100 అదనంగా పెంచుకునేలా సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ టికెట్ల రేట్లు 12, 13, 14 తేదీల్లో పెంచుకునేలా సర్క్యులర్‌ను హోంశాఖ ఇచ్చింది.






