ఎవరి ప్రయోజనాల కోసం రోడ్డు నిర్మాణం?
పేద ప్రజల ఇండ్ల ను కూల్చివేయడం వెనకాల నాయకుల ప్రయోజనాలు ఏంటి ?
మా గూడు కోసం గోడు వినిపించడం లేదా?
కోర్టు స్టే ఉన్న రోడ్డు నిర్మాణం ఎలా చేపడతారు
రోడ్డు పనులు చేపడితే నాయకుల ఇండ్లు ముట్టడిస్తాం
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
అధిబట్ల గ్రామంలో రోడ్డు నిర్మాణం చేపడితే పెద్ద ఎత్తున నాయకుల ఇండ్లను ముట్టడిస్తాం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని రామచంద్రయ్య విగ్రహం నుండి ఔటర్ వరకు ఇండ్ల మధ్య నుంచి 120 ఫీట్ల రోడ్ వెడల్పు చేపట్టాలని ప్రభుత్వం గతంలో శిలాఫలకం వేయడం జరిగింది. దీని వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు ఏ నాయకుల కోసం ఎవరికోసం ఎవరి స్వలాభం కోసం గ్రామం మధ్యలో 120 ఫీట్లు రోడ్ నిర్మాణం చేపడుతున్నారని ప్రశ్నించారు. రోడ్ కు ఇరు వైపులా గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న ఇండ్ల పరిస్థితి ఏమిటి అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. రాజకీయ నాయకులు సొంత లాభం కోసం కమీషన్ల కోసం గ్రామస్తుల బాగోగులు పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు రోడ్ నిర్మాణంలో తలదుర్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులకు వారి భూములు, ప్లాట్స్ ధరలు పెరిగి రియల్ ఎస్టేట్ పెరుగుతుందని, రోడ్ వెడల్పు చేయాలని అధికారులకు వెనుక నుండి కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతున్నారని పల్లె శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఏది ఏమైనా మాకు కోర్ట్ స్టే ఉంది ఊరిలో నుండి రోడ్ తీసే ప్రసక్తే లేదని శ్రీనివాస్ గౌడ్ ఇండ్ల యజమానులకు అభయమిచ్చారు.. రోడ్డు నిర్మాణం పై కోర్ట్ స్టే ఉన్నందున రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్లను కూల్చివేయాలని చూస్తే కబర్దార్ అని హెచ్చరిoచారు.








