Mahaa Daily Exclusive

  పరకాల మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా దుగ్యాల రాజేశ్వర్ రావు

Share

పరకాల మహా:
హన్మకొండ జిల్లా పరకాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ దుగ్యాల రాజేశ్వరరావు ను ఏకగ్రీవంగా అన్ని గ్రామాల సర్పంచ్ లు ఎన్నుకోవడం జరిగింది
ఈ సందర్భంగా రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మండల సర్పంచ్ ల ఫోరం బాధ్యతలను అప్పగించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గ్రామాల అభివృద్దికి వినియోగించేవిధంగా కృషి చేస్తానని తెలిపారు. సర్పంచ్‌లకు ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుండి పోరాడతానని హామీ ఇచ్చారు. మండల సర్పంచ్‌ల ఫోరం బాధ్యతలను అప్పగించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు

సర్పంచుల హక్కులకై సర్పంచుల సమస్యలపై మీ ముందుండి మీ నాయకునిగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదములు తెలిపారు