- ప్రజలు హక్కుల పై అవగాహన కలిగి ఉండాలి
- -అంటరానితనం ప్రదర్శించడం నేరం!
- -దళితులు ఎలాంటి సమస్యలున్న మా దృష్టికి తీసుకురావాలి!
- -వెంటనే వాటిని పరిష్కరిస్తాం!
- -తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, సీఐ సంతోష్, ఎంపిడిఓ శ్రీనివాస్ రెడ్డి!
- -ఎస్సీ ఎస్టీ కేసులలో స్టేషన్ బెయిలు ఇవ్వద్దు!
- -సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించకుండా చూడాలి!
- -ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్!
పరకాల మహా
ప్రజలు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి యుండి చట్టాల పట్ల గౌరవంతో సోదరా భావాన్ని పెంపొందించుకోవాలని తహాశీల్దార్ జగన్మోహన్ రెడ్డి,సిఐ సంతోష్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి సూచించారు.మంగళవారం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని కామారం గ్రామంలో సర్పంచ్ తోట వరలక్ష్మి కుమార్ అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ దళితుల పట్ల అంటరానితనాన్ని ప్రదర్శించడం నేరమని, దళితులు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులలో స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని ఎస్సీ,ఎస్టీ నిధులు దారి మళ్లకుండా, దళితవాడలోనే అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ హారిక, పిహెచ్ సి డాక్టర్ కందకట్ల సంపత్, ఉపసర్పంచ్ ఎలగొండ రాజు తో పాటు వివిధ శాఖల అధికారులు గ్రామస్తులు పాల్గోన్నారు.








