Mahaa Daily Exclusive

  వైద్య వృత్తికే వన్నె తెచ్చిన డాక్టర్ జ్యోతిర్మయి: మణుగూరు సింగరేణి సేవా కార్యదర్శి షేక్ షాకీరా ప్రశంస

Share

  • వైద్య వృత్తికే వన్నె తెచ్చిన డాక్టర్ జ్యోతిర్మయి సేవలు ప్రశంసనీయం
  • ఏరియా సేవా కార్యదర్శి షేక్ షాకీరా ప్రశంస

సింగరేణి మణుగూరు ఏరియా ఆసుపత్రి ఉప ముఖ్య వైద్యాధికారిణి జ్యోతిర్మయినీ ఘనంగా సత్కరించిన సేవా సభ్యులు
సవాళ్లను అధిగమిస్తూ ఒకవైపు శస్త్ర చికిత్స వైద్య నిపుణురాలిగా సేవలందిస్తూనే మరోవైపు సింగరేణి ఏరియా ఆసుపత్రి ఉప ముఖ్య వైద్యాధికారిణిగా తన సమర్థతను నిరూపించుకుంటూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న సర్జన్ మేడం డాక్టర్ ఎం జ్యోతిర్మయి గారి సేవలు ప్రశంసనీయమని మణుగూరు ఏరియా సింగరేణి సేవా కార్యదర్శి షేక్ షాకీరా అభినందించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శనివారం నాడు సింగరేణి మణుగూరు ఏరియా ఆసుపత్రి ఉప ముఖ్య వైద్యాధికారిణిగా (డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ,డివైసీఎంఓ) డాక్టర్ జ్యోతిర్మయి గారిని పుష్పగుచ్చం శాలువాతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా షాకిరా మాట్లాడుతూ సర్జన్ మేడం జ్యోతిర్మయి గారి వైద్యమంటే మణుగూరు ఏరియా సింగరేణి ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ఎంతో నమ్మకమని ప్రత్యేకించి మహిళా పేషెంట్లు వైద్యం కోసం బారులు తీరి ఆలస్యమైనా కూడా ఎంతో ఓపికగా ఆమె వైద్యం కోసం వేసి ఉంటారని ఆమె కూడా అంతే ఓపికగా పేషంట్ చెప్పేది విని తగు వైద్యం అందజేస్తారని మహిళా మణులకు మరింత ప్రీతి పాత్రమైన వైద్యురాలని “వైద్యో నారాయణో హరి”అనే పదాన్ని నిజం చేస్తున్నారని ఇంట్లో కన్నా ఆమె ఆసుపత్రిలోనే ఎక్కువ గడుపుతారని ఏరియా ఆసుపత్రిలో ప్రసూతి వైద్యాన్ని కూడా పునరుద్ధరించారని ఆమె కొనియాడారు. ఏరియా జీఎం దుర్గం రామచందర్ గారి నేతృత్వంలో జ్యోతిర్మయి గారి పర్యవేక్షణలో ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందజేస్తూ సీనియర్ వైద్యులతో పాటు ఇతర డాక్టర్లను సిబ్బందిను కూడా సమన్వయం చేసుకుంటూ మణుగూరు ప్రాంతం ఉద్యోగుల విశ్వాసాన్ని అభిమానాన్ని చూరగోoటున్నారని సింగరేణి ఖ్యాతినీ మరింత ఇనుమడింప చేస్తున్నారని ఆమె అన్నారు. ఉద్యోగపర్వంలో సర్జన్ మేడం జ్యోతిర్మయి గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సభ్యులు పి సంధ్య, చింతల మాధవి, ఎం లక్ష్మి, ఖతర్, కనక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.