Mahaa Daily Exclusive

  పినపాక అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భేటీ

Share

  • సీఎం రేవంత్ తో పినపాక ఎమ్మెల్యే పాయం భేటీ
  • పినపాక నియోజకవర్గ అభివృద్ధికి కీలక వినతులు
  • అసెంబ్లీలోనూ ప్రజాసమస్యలపై పాయం గళం
  • సాగునీరు, పాలనాసౌలభ్యం, విద్య, ఆరోగ్యరంగాల మెరుగుకు సహకరించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, మహా

పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ సమస్యలు వివరించారు. పినపాక నియోజకవర్గంలో ఉన్న కీలక సమస్యలు, అభివృద్ధి అవసరాలను ముఖ్యమంత్రికి వివరించి వినతిపత్రం సమర్పించారు. పులుసుబొంత ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయాలని, భూపతిరావుపేట, చింతల బయ్యారం, అన్నారం ప్రాంతాల్లో గోదావరి ఆధారిత ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలని, కిన్నెరసాని నది, జిల్లేరు వాగు, మల్లన్న వాగు, 7 మేకల వాగులపై సాగునీటి పథకాలకు నిధులు కేటాయించాలని కోరారు. టేకులపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టును విభజించి, గుండాల–ఆళ్లపల్లి మండలాలతో కొత్త ఐసిడిఎస్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని, టేకులపల్లి పీఎస్ సర్కిల్ పరిధిలోని ఆళ్లపల్లి మండలాన్ని గుండాల సర్కిల్‌లో కలపాలని విజ్ఞప్తి చేశారు. ఫారెస్ట్ అనుమతుల లేక నిలిచిపోయిన అభివృద్ధి పనులకు తక్షణ అనుమతులు మంజూరు చేయాలని, భవిష్యత్ అభివృద్ధి పనులకు అనుమతులు సులభతరం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, సారపాక, మొండికుంట, రామానుజవరం ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. పాయం వినతులపై సీఎం సానుకూలంగా స్పందించారు.
అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి సాగు చేస్తున్న గిరిజనులు, రైతులకు పోడుపట్టాలు మంజూరు చేసి, వారి జీవనోపాధి భద్రతకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కి వివరించారు