మహా : ఇరాన్‌లో ఆందోళనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. నిరసనలు కొనసాగించాలని, ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ నిరసనకారులకు పిలుపునిచ్చారు. పోరాటం చేసేవారికి సాయం అందిస్తామని పేర్కొంటూ సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ‘‘ఇరాన్ దేశభక్తులారా.. నిరసనలు కొనసాగించండి. మీ ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోండి! హంతకులు, దాడులు చేసేవారి పేర్లను నమోదు చేసుకోండి. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నిరసనకారుల హత్యలు ఆపే వరకు ఇరాన్ అధికారులతో అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నా. నిరసనకారులకు సాయం అందిస్తాం’’ అని ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు.
Post Views: 15







