Mahaa Daily Exclusive

  సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్….

Share

  • సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్..
  • హోం శాఖ కార్యదర్శికి సుమోటో కంటెంప్ట్ నోటీసులు జారీ

హైదరాబాద్, మహా : సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు హోం శాఖ జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీ ఆనంద్‌‌కు హైకోర్టు సుమోటో కంటెంప్ట్ నోటీసులు జారీ చేసింది. గత ఆదేశాలను ధిక్కరిస్తూ మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి ధరలు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ పై అడ్వకేట్ విజయ్ గోపాల్ వాదనలు వినిపిస్తూ హోంశాఖ అధికారులు గత ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారన్నారు. మన శంకర వరప్రసాద్ సినిమా టికెట్ల రేట్లు పెంచిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాకుండా దాచిపెట్టారంటూ పిటిషనర్ తరఫున న్యాయవాది పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సీవీ ఆనంద్‌కు హైకోర్టు కంటెంప్ట్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్-1955 ప్రకారమే ధరల నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇకపై ఏ సినిమాకైనా టికెట్ ధరల పెంపు నిర్ణయం తీసుకునేటప్పుడు 90 రోజుల ముందే ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా మళ్లీ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.