- విభిన్న కథనాలకు కేరాఫ్ మహా తెలుగు దినపత్రిక
- ప్రజలను చైతన్య పరచడంలో “మహా” కీలక పాత్ర
- బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
వరంగల్ హన్మకొండ మహా;
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ చేతుల మీదుగా మహా తెలుగు దినపత్రిక వారు రూపొందించిన 2026 ఆంగ్ల నూతన సంవత్సరం క్యాలెండర్ ను వరంగల్ మహా తెలుగు దినపత్రిక గ్రేటర్ వరంగల్ ప్రతినిధి ఈద శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా గౌరవ కమీషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో
వార్తల సేకరణలో ముందు ఉంటూ నిత్యం ప్రజలకు వార్తా విశేషాలను వేగంగా చేరవేస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ సమాజ శ్రేయస్సు కోరి వివిధ విభిన్న కథనాలను ప్రచురిస్తూ ప్రతి ఒక్కరిలో సామాజిక స్పృహను కలిగించేలా కృషి చేస్తూ సమ సమాజ నిర్మాణానికి పాటుపడుతున్న “మహా తెలుగు దినపత్రిక” యజమాన్యానికి, ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే ప్రతి సంవత్సరం ప్రజల ఆదరణను పెంపొందించుకుంటూ భవిష్యత్తులో కూడా మీడియా రంగంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రజా ఆదరణతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మహా దినపత్రిక పాఠకులకు, అభిమానులకు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బల్దియా అధికారులు, సిబ్బంది, మహా దినపత్రిక రిపోర్టర్లు,తదితరులు పాల్గొన్నారు.








