- శంషాబాద్ విమానాశ్రయ సీఐఎస్ఎఫ్ యూనిట్ లో
- ఘనంగా ప్రారంభమైన చేతి కుస్తీ పోటీలు
- 11 యూనిట్ల నుంచి తరలి వచ్చిన క్రీడాకారులు
శంషాబాద్, మహా : శంషాబాద్ విమానాశ్రయ పరిధిలోని సీఐఎస్ఎఫ్ యూనిట్ (ఎఎస్ జీ హైదరాబాద్) ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అంతర్-యూనిట్ ఆర్మ్ రెజ్లింగ్ (చేతి కుస్తీ) పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సీఐఎస్ఎఫ్ యూనిట్ల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. సీఐఎస్ఎఫ్ చరిత్రలోనే మొదటిసారిగా ఈ స్థాయి ఆర్మ్ రెజ్లింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 11 వేర్వేరు యూనిట్ల నుంచి మొత్తం 42 మంది పురుషులు, 10 మంది మహిళా క్రీడాకారులు ఈ పోటీల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశ్యం.
ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ, కేవలం విధి నిర్వహణకే పరిమితం కాకుండా సిబ్బందిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ రంజన్, డీఐజీ ఎస్.కె. మొహంతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. క్రీడాకారులు జాతీయ స్థాయిలో తమ నైపుణ్యాన్ని నిరూపించుకుని, సంస్థకు మంచి పేరు తీసుకురావాలని అధికారులు ఆకాంక్షించారు. పంజాబ్, హెమంత్ అనుగ్రీష్ హైండ్ రెసిలింగ్ ప్రెసిడెంట్, ఎ. అలందార్ వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ, ఫారూఖ్ గందర్బాలి వైస్ ప్రెసిడెంట్ (జమ్ముకాశ్మీర్), డా, విపి సింగ్ ఉత్తర్ ప్రదేశ్ జనరల్ సెక్రటరీ, మన్‌బోర్ కైత్రీమ్ మెగాలయా జనరల్ సెక్రటరీ, పాక్జార్ తైపోడియా ట్రెజరర్ అరుణాచల్ ప్రదేశ్, లక్‌బీర్ సింగ్ టెక్నికల్ అడ్వజర్ అరుణాచల్ ప్రదేశ్ అధ్వర్యంలో ఈ హైడ్ పోటీలను నిర్వహించనున్నారు.








