Mahaa Daily Exclusive

  సికందును బావిలో పడేసిన కోతి .. కాపాడిన డైపర్..

Share

 

మహా: తల్లి చేతుల్లో ఉన్న పసికందును కోతి లాక్కెళ్లి బావిలో పడేస్తే.. చిన్నారికి వేసిన డైపర్‌ వల్ల ప్రాణాలు నిలిచిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. సియోని జిల్లాలోని గ్రామంలో ఓ మహిళ తన 20 రోజుల పసికందుతో ఇంటి బయట కూర్చుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన కోతులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. ఓ కోతి మహిళ ఒడిలో ఉన్న చిన్నారిని లాక్కెళ్లింది. వెంటనే మహిళ, చుట్టుపక్కల వారు అరుస్తూ దానిని వెంబడించారు. దీంతో కోతి దూరంగా ఉన్న ఓ బావిలో చిన్నారిని విసిరేసి వెళ్లిపోయింది. పసిబిడ్డ కోసం వెతుకుతూ వచ్చిన గ్రామస్థులకు చిన్నారి బావిలో తేలుతూ కనిపించడంతో వెంటనే రక్షించారు. పాపకు వేసిన డైపర్‌ లైఫ్ జాకెట్‌లా నీటిలో తేలడం వల్లే చిన్నారి ప్రాణాలు నిలిచాయని స్థానిక నర్సు రాజేశ్వరి పేర్కొన్నారు. బావిలో నుంచి తీసిన వెంటనే శిశువుకు అత్యవసర చికిత్స అందించారు. కోతులు, ఇతర అడవి జంతువులు తరచూ ఇళ్లలోకి వచ్చి దాడి చేస్తున్నాయని గ్రామస్థులు వాపోయారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదన్నారు.