మహా : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసులో పలు అంశాలను ప్రస్తావించారు కేటీఆర్. తనపై, తన కుటుంబంపై నిరాధార, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఈ లీగల్ నోటీసులు జారీ చేసినట్టు స్పష్టం చేశారు. నోటీసులు అందిన ఐదు రోజుల్లోగా స్పందించని పక్షంలో, సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వీరు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు.
Post Views: 12








