హైదరాబాద్, మహా: హైదరాబాద్‌లోని పంజాగుట్టలో పోలీసులు డ్రగ్స్ కేసులో ఐదుగురు కాలేజీ విద్యార్థులను అరెస్టు చేశారు. నాగార్జున సర్కిల్ వద్ద వీరిని 10 గ్రాముల ఎండీఎంఏతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒకే కాలేజీకి చెందిన వీరు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. తెలంగాణ పోలీస్ శాఖ డ్రగ్ కల్చర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించింది.
Post Views: 9








