మందుబాబులు కారుతో బీభత్సం.. ఎస్సై కాలుకు తీవ్ర గాయం
డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా ఘటన
గాయపరిచి పారిపోతున్న వాహనాన్ని పట్టుకున్న పోలీసులు
నిందితులపై కేసు నమోదు దర్యాప్తు
రంగారెడ్డి జిల్లా మహా:
యాచారం మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసుల పైకి దూసుకు వచ్చిన కారు బీభత్సం సృష్టించింది. ఎస్సై కాలుకు గాయం. యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా, యాచారం పోలీస్ స్టేషన్ ముందు సాగర్ రహదారిపై, సిఐ నందీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న క్రమంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. వాహనాలను నిలిపి తనిఖీ చేసి పంపిస్తున్న తరుణంలో అటుగా దూసుకు వచ్చిన షిఫ్ట్ కారు దానిలో ఉన్న వాహనదారులు ఫుల్లుగా మద్యం సేవించి, వేగ వేగంగా వాహనాన్ని నడుపుతూ ఉండడంతో, పోలీసులు నిలువరించే క్రమంలో వాహనాన్ని నిలపకుండా వేగంగా వెళ్లడంతో ఎస్సై మధు కాలుకు గాయం కావడంతో, మాల్ గ్రామంలోని ఓ దవఖానలో చికిత్స అందించడం జరిగింది. అదే వేగంతో దూసుకొచ్చిన కారు, యాచారంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మరో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని దవఖానకు తరలించారు. మందుబాబులు అతివేగంగా అక్కడి నుంచి పరారై వెళ్తున్న క్రమంలో, పోలీస్ వాహనం వారిని వెంబడించగా ఇబ్రహీంపట్నం మండలం ఖానాపూర్ గ్రామంలో ఆ యొక్క వాహనాన్ని పట్టుకోవడం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని సిఐ వెల్లడించారు.








