Mahaa Daily Exclusive

  ఎంపీలు టీడీపీ శ్రేణులతో మమేకమవ్వాలి…

Share

  • ఎంపీలు టీడీపీ శ్రేణులతో మమేకమవ్వాలి
  • మంత్రులతో సమన్వయం చేసుకోవాలి
  • మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం

అమరావతి, మహా : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి, నారా లోకేశ్ టీడీపీ ఎంపీలతో ఆదివారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. దాదాపు గంట పాటు ఎంపీలతో లోకేశ్ విడిగా భేటీ అయ్యారు. మంత్రులతో పాటు ఎంపీలు పార్టీ కేంద్ర కార్యాలయానికి తప్పనిసరిగా రావాలని హుకుం జారీ చేశారు. రాష్ట్ర మంత్రితో సమన్వయం చేసుకునేలా ప్రతీ ఎంపీకి కొన్ని శాఖలు అప్పగించామని స్పష్టం చేశారు. సంబంధిత శాఖా మంత్రి పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆ మంత్రి శాఖలు కేంద్రంతో సమన్వయం చేసే ఎంపీ కూడా రావాలని సూచించారు.