Mahaa Daily Exclusive

  మోగిన ఎన్నికల నగారా…

Share

  • మోగిన ఎన్నికల నగారా…
  • రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు
  • జిల్లాలో మరో మారు ఎన్నికల కోడ్…
  • నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలు ఎస్ఇసి
  • జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి

 

 

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైందని, నేటితో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, వచ్చే నెల 11న పోలింగ్ జరగనున్నట్లు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపారు. గతవారం క్రితం విడుదల చేసిన రిజర్వేషన్లతో మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుండడంతో, నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల వాతావరణ మరింత వేడెక్కింది. ఆశావాహులు తమ తమ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు పార్టీల నుంచి బి ఫామ్ ఎవరికి వస్తుందని ఆశతో ఆశావాహులు ఉన్నారు కొందరు స్వతంత్రంగా నాయన పోటీలో ఉండి నెగ్గాలని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి మధ్య పోటీ బలంగా ఉన్నా’ సిపిఐ సిపిఎం బలం ఎటువైపు అనేది, గెలుపు ఎవరిది అనేది వేచి చూడాల్సి ఉంది. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఈ పంథా కొనసాగింది. ఇప్పుడు గెలుపోటములు ఎవరు వంతు అనేది, వచ్చేనెల 11న జరిగే పోలింగ్లో తేలాల్సి ఉంది.