- ఫిబ్రవరి 7 న పరిగికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి
- సభా స్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
పరిగి, మహా : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 7 న పరిగికి రానున్నారు. మండలంలోని సుల్తాన్ పూర్ గ్రామ పరిదిలోని నారాయణపూర్ వద్ద జరిగే బహిరంగసభలో సీఎం ప్రసంగించనున్నారు. సందర్భంగా సభ ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శుక్రవారం ముందస్తు సమీక్ష నిర్వహించారు. సీఎం సభా స్థలిని స్థానిక డీఎస్పీ డీఎస్పీ శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, జన సమీకరణ, వాహన పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై అధికారులు, నాయకులతో కలిసి చర్చించారు. సీఎం సభకు
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నాయకులు పాల్గొననున్నట్లు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయపథంలో దూసుకెళ్తుందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు.
నామినేషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు
హాజరైన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి
పరిగి, మహా : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ లను శుక్రవారం దాఖలు చేశారు. 4 వ వార్డు నుండి శివనోళ్ళ చంద్రకళ, 14వ వార్డు నుంచి ఆనెం సరిత నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారులకు అందజేయడం జరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా ఖాయమని, ప్రజలు తమకు మద్దతు ఇచ్చి గెలిపించాలని ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి కోరారు.








