Mahaa Daily Exclusive

  అన్నీ తానై.. ముందుండి నడిపించి..! నామినేషన్ల చివరి రోజు బిజీబిజీగా రాజేందర్ రావు..

Share

  • అన్నీ తానై.. ముందుండి నడిపించి..
  • నేతలకు మద్దతుగా ర్యాలీల్లో వెలిచాల
  • నామినేషన్ల చివరి రోజు బిజీబిజీగా రాజేందర్ రావు..
  • కాంగ్రెస్ నాయకుల నామినేషన్ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్న వెలిచాల..

 

కరీంనగర్ మహా : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో నామినేషన్ల చివరి రోజు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి బిజీ బిజీగా మారారు. అన్ని తానై నేతలకు దేశానిర్దేశం చేస్తూ ముందుండి నడిపించారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా పలు కార్యక్రమాల్లో రాజేందర్రావు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులకు మద్దతుగా నామినేషన్ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలకు రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శుక్రవారం ఉదయం 46వ డివిజన్లో కాంగ్రెస్ నేత మల్లికార్జున రాజేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ నేతలతో పార్టీ విజయవకాశాలు ప్రచారం ఇతర కార్యక్రమాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని దిశా నిర్దేశం చేశారు. అనంతరం 11వ డివిజన్ కట్ట రాంపూర్ లో కాంగ్రెస్ నాయకులు ఆకుల నర్మద నరసన్న నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్ తో కలిసి రాజేందర్ రావు పాల్గొన్నారు. 11వ డివిజన్ మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం 42 డివిజన్లో కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పంజాల రాజన్న నామినేషన్ కార్యక్రమంలో రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. అవినీతి ఆనకొండ సునీల్ రావు ని బొంద పెట్టి బొంద పెట్టాలని ప్రజలను కోరారు. అవినీతి అక్రమాలకు పాల్పడే సునీల్ రావుకు చమరగీతం పాడాలని నీతి నిజాయితీగా వ్యవహరించే రాజన్న అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వందలాది మంది మహిళలు డివిజన్ ప్రజలు నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుడు మాచర్ల ప్రసాద్ కు మద్దతుగా 66వ డివిజన్ టవర్ ప్రాంతంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని ఓటర్లను కోరారు. అక్కడి నుంచి 12 డివిజన్లో కాంగ్రెస్ నాయకులు తిప్పారపు స్వప్న శ్రీనివాస్ కు మద్దతుగా నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. తర్వాత 32 డివిజన్లో కాంగ్రెస్ సమద్ నవీద్ కు మద్దతుగా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలు నాయకులు డివిజన్ ప్రజలతో కలిసి భారీ ర్యాలీకి హాజరై రాజేందర్ రావు మద్దతు ప్రకటించారు. ఆయాచోట్ల జరిగిన కార్యక్రమాల్లో రాజేందర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ బిజెపి లను మున్సిపల్ ఎన్నికల్లో బొంద పెట్టాలని వారితో ఏ పని కాదన్నారు. కరీంనగర్ లో ఏ పని కావాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలకులు కరీంనగర్లో దోపిడీలు దౌర్జన్యాలు భూకబ్జాలు చేసి రికార్డు సృష్టించారని ఆరోపించారు. అలాంటి అక్రమార్కులకు అవినీతిపరులకు ఓట్లు వేస్తే వృధానేనని మళ్లీ ప్రజలను పీక్కుతింటారని మండిపడ్డారు. గల్లీల సమస్యలతో బిజెపికి సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ బిజెపి అభివృద్ధి విషయంలో ప్రజలను మోసం చేసి మళ్లీ ఓట్లు అడుగుతున్నారని వారికి ఓటు అడిగే హక్కు లేదని రాజేందర్రావు మండిపడ్డారు. కరీంనగర్ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి అండగా నిలిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

 

సునీల్ రావు పై

నిప్పులు జరిగిన వెలిచాల..

 

డొక్కు స్కూటర్ నుంచి

వందల కోట్లకు అధిపతి..

 

అధునాతనమైన భవంతి ఎలా సాధ్యమైంది..?

 

సునీల్ రావ్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని వెలిచాల ఫైర్..

 

42వ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పంజాల రాజన్న గౌడ్ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డొక్కు స్కూటర్ పై తిరిగిన సునీల్ రావు వందల కోట్లకు అధిపతి అయ్యారని ఆరోపించారు. మేయర్ గా పనిచేసిన కాలంలో స్మార్ట్ సిటీ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి వందల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. కరీంనగర్లో అపార్ట్మెంట్ కట్టినా ఇల్లు కట్టినా దుకాణం పెట్టినా ఇతర అభివృద్ధి పనులు చేపట్టినా ఆయనకు కప్పం కట్టాల్సిందేనని కట్టకపోతే పనులు ఆపేవారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రజల జేబుల్లో చేతులు పెట్టి ప్రజలను దోచుకుతిని నేడు నీతి వాక్యాలు బోధిస్తున్నారని విమర్శించారు. తనపై వ్యక్తిగతంగా దూషణలకు దిగుతూ బాడీ షేమింగ్ కు పాల్పడ్డారని ఆయనకు ఏమాత్రం రాజకీయ విలువలు లేవని దుయపడ్డారు. ఆయనకు పైసలే పరమాత్మ అని ప్రజల అవసరం లేదన్నారు. 42వ డివిజన్ ప్రజలు నీతిగా నిజాయితీగా వ్యవహరించే డాక్టర్ రాజన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డివిజన్ ను కరీంనగర్ లోనే అత్యద్భుతమైన డివిజన్ గా తీర్చిదిద్దే బాధ్యత నాది అని రాజేందర్రావు స్పష్టం చేశారు. డివిజన్ ప్రజలంతా సునీల్ రావును చిత్తుచిత్తుగా ఓడించి తీరాలని రాజన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, ముఖ్యులు ఆయా డివిజన్లో అధ్యక్షులు నాయకులు వివిధ సంఘాల నాయకులు మహిళా నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.