Mahaa Daily Exclusive

  ఆర్‌టీఐ చట్టాన్ని బలహీనపరుస్తున్న మోదీ ప్రభుత్వం..

Share

  • ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫైర్

ఢిల్లీ, మహా

ఎంజీనరేగా’ను చంపేశారు. ఇప్పుడు ఆర్‌టీఐ వంతు వచ్చిందా?’ అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆర్థిక సర్వే నివేదికలో ఆర్‌టీఐ చట్టాన్ని పునఃపరిశీలించాలని సూచించిన నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్‌టీఐ చట్టాన్ని బలహీనపరుస్తోందని ఖర్గే ఆరోపించారు. నిజాన్ని బయటపెట్టే వారికి భయాందోళనసు కలిగించే పరిస్థితులను తీసుకొచ్చిందని విమర్శించారు. నిజాన్వేషకులను శిక్షించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటి వరకు 100 మందికి పైగా ఆర్‌టీఐ కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆయన ఆరోపించారు. మరోవైపు, ఆర్థిక సర్వే నివేదికలో ఆర్‌టీఐ చట్టాన్ని ‘రీ-ఎగ్జామినేషన్’ చేయాలని సూచించడంపై ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, సర్వీస్ రికార్డులు, సిబ్బంది నివేదికలను ప్రజల పరిశీలన నుంచి తప్పించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆరోపించారు. అన్నింటి కంటే ముఖ్యంగా సమాచారాన్ని నిలిపివేయడానికి మంత్రులకు ప్రత్యేక అధికారం (వీటో) కల్పించే ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది పారదర్శకతను దెబ్బతీస్తుందని అన్నారు.