Mahaa Daily Exclusive

  ప్రభుత్వ భూములకు అండగా తహసిల్ధార్…

Share

  • ప్రభుత్వ భూములకు అండగా తహసిల్ధార్
  • కాప్రా మండల పరిధిలో ప్రభుత్వ భూములు కాపాడుతున్న బైరెడ్డి రాజేష్

కాప్రా, మహా : మండల పరిధిలోని జవహర్ నగర్ ప్రభుత్వ భూములు సర్వే నంబర్ 205, 364, 497 695, 696 లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణలపై స్పందించిన కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేష్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టలు రమేష్, సత్యనారాయణ మరియు రెవిన్యూ సిబ్బంది కలసి జేఏసీ వాహన సహకారంతో ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న నిర్మాణాలు కూల్చిచేశారు. ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణలు చేస్తే కఠిన చెర్యలు తప్పవు అంటూ తహసీల్దార్ గారు రెవిన్యూ అధికార సిబ్బంది హెచ్చరించారు. ప్రభుత్వ భూములు కాపాడడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు అలాగే ప్రభుత్వ భూముల విషయం లో దళరులు ఎవరు భూములు అమ్మిన ప్రజలు కొనుగోళ్లు చేసి మోసపోవద్దు అని సూచిస్తున్నారు. ఏదిఎమైనా ప్రభుత్వ భూములలో వెలుస్తున్న నిర్మాణలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ప్రభుత్వ భూములు కబ్జా చేద్దాం అని ఆలోచిస్తున్న భూకబ్జాదారుల పై కేసులు నమోదు చేయాలని ప్రజల కోరుతున్నారు.