- ఐ అండ్ పీఆర్ కార్యాలయాన్ని ముట్టడించిన
- కేబుల్ టీవీ యాజమాన్యాలు
- దద్దరిల్లిన ధర్నా.. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన జర్నలిస్టులు
హైదరాబాద్, మహా
కేబుల్ ఛానళ్ళపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ ఐ అండ్ పిఆర్ కార్యాలయాన్ని కేబుల్ టీవీ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముట్టడించారు. ధర్నాతో ఐ అండ్ పిఆర్ కార్యాలయం ముట్టడించగా, కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్సీ ఎండి ఈశ్వర్ , టీయుడబ్ల్యుజె అధ్యక్షుడు విరాహత్ అలీ, జర్నలిస్టు యూనియన్ నాయకులు మారుతీసాగర్, వివిధ కేబుల్ టీవీ ఛానళ్ళ యాజమాన్యాలు, రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేబుల్ టీవీ లలో పనిచేస్తున్న జర్నలిస్టులకు గతంలో ఇచ్చినట్లు రాష్ట్రస్థాయిలో 12, జిల్లాస్థాయిలో ప్రతి జిల్లాకు నాలుగు చొప్పున అక్రిడిటేషన్లు మంజూరుచేయాలని, కేబుల్ ఛానళ్ళపై పక్షపాత ధోరణిని మానుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.
Post Views: 16








