హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని పలు ప్రధాన శాఖాధిపతుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. బుధవారం విడుదలైన అధికారిక ఉత్తర్వుల ప్రకారం ఈ బదిలీలు రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. బదలీ ఉత్తర్వుల ప్రకారం సింగరేణి సీఎండీగా డా.జ్యోతి బుద్ధప్రకాశ్ని నియమించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్ నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్ కొనసాగనున్నారు. టీడీఆర్ఏసీ డీజీగా సందీప్‌కుమార్ సుల్తానియాని నియమించింది. పంచాయతీరాజ్ కమిషనర్‌గా దివ్య దేవరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా కాత్యాయనీ దేవిని నియమించింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండీగా కాత్యాయనికి అదనపు బాధ్యతలు కేటాయించింది. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు జాయింట్ ఎండీగా మయాంక్ మిట్టల్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ స్పెషల్ సీఎస్‌గా రఘురాంశర్మలకు బాధ్యతలను అప్పగించింది. అలాగే, మంత్రి శ్రీధర్‌బాబు ఓఎస్డీగా అదనపు బాధ్యతల్లో రఘురాంశర్మ కొనసాగనున్నారు.








