Mahaa Daily Exclusive

  మాట నిలబెట్టుకున్న జగ్గారెడ్డి

Share

మాట నిలబెట్టుకున్న జగ్గారెడ్డి

* సంగారెడ్డి, సదాశివపేటలో కాంగ్రెస్ మెజారిటీ
• సంగారెడ్డి చైర్పర్సన్ గా వనితా సంతోష్ , వైస్ చైర్మన్గా షేక్ షఫీ
• సదాశివపేట చైర్ పర్సన్గా మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్ పర్సన్గా రేణుక చిరు
* 38లో 22, 26లో 16 స్థానాలు కైవసం

సంగారెడ్డి ప్రతినిధి :మహా :
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి , సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఎన్నికల ఫలితాల అనంతరం, జగ్గారెడ్డి తాను అభ్యర్థులకు ఇచ్చిన మాట ప్రకారం చైర్మన్ , వైస్ చైర్మన్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు.
జగ్గారెడ్డి ప్రకటించిన వివరాల ప్రకారం, సంగారెడ్డి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్‌గా షేక్ షఫీ ఎంపికయ్యారు. సదాశివపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్మన్‌గా రేణుక చిరును ఫైనల్ చేశారు. వీరంతా ఈ నెల 16వ తేదీన (ఎల్లుండి) అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ 22 వార్డులను కైవసం చేసుకుంది. అలాగే సదాశివపేటలోని 26 వార్డులలో 16 స్థానాలను గెలుచుకొని తిరుగులేని పట్టు సాధించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గారెడ్డి ప్రతి వార్డుకు 8 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తెస్తానని, అలాగే ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని ఇచ్చిన హామీలు ఓటర్లను ఎంతగానో ఆకర్షించాయి. ఈ సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్ గా ప్రకటించిన అభ్యర్థులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ లకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపి, జీవితాంతం రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేశారు.

Latest