సంగారెడ్డి ప్రతినిధి :మహా :
సదాశివపేట మండలంలోని మిలగిరి పేట గ్రామ సర్పంచ్ షాబుద్దీన్ తన సొంత డబ్బులతో గ్రామానికి ముఖద్వారం నిర్మింప చేయడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ షాబుద్దీన్ మాట్లాడుతూ గ్రామానికి వచ్చేవారికి బోర్డు లేకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుందని కాబట్టి తన సొంత డబ్బులతో గ్రామానికి ముఖద్వారం నిర్మింప చేయడం జరిగిందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి మరియు టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సహకారంతో నిధులు తీసుకొచ్చి గ్రామంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తానన్నారు.
శనివారం గ్రామ ముఖద్వారం సర్పంచ్ షాబుద్దీన్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
ఉపసర్పంచ్ యాదయ్య, వార్డ్ మెంబర్లు నరసింహారెడ్డి, శ్రీనివాస్, యాదుల్, పెంటయ్య, పంచాయతీ కార్యదర్శి రాములు, రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుభాన్ రెడ్డి, సంజీవరెడ్డి, రియాజ్, మహేందర్ రెడ్డి, మాణిక్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, టేకురి కిష్టయ్య, రత్నయ్య, మల్లేశం, సంగయ్య, చంద్రయ్య, ప్రభు, నగేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.








