Mahaa Daily Exclusive

  ప్రచారంలో తిట్ల పురాణం.. ఫలితాల తర్వాత… ఆత్మీయత….?

Share

  • ప్రచారంలో తిట్ల పురాణం.. ఫలితాల తర్వాత… ఆత్మీయత….?

• మెజారిటీ బిఆర్ఎస్ దక్కిన చైర్మన్ సీటు దక్కుతుందా…..?

• చైర్మన్ పీఠం కోసం బీజేపీ… కాంగ్రెస్ పొత్తు…..?

• బీజేపీ కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరాందా….?

•ఆమనగల్లులో చైర్మన్ పీఠంపై కన్నేసిన బీజేపీ

• మెజారిటీకి 2అడుగుల దూరంలో…

• కాంగ్రెస్ మద్దతుతో,కీలకం కానున్న ఎక్స్ అఫీషియో

•సర్వత్రా ఉత్కంట అయోమయంలో మున్సిపాలిటీ ఓటర్లు

 

ఆమనగల్లు మహా ::- గత వారం కింద మూడు ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న ఫలితాల అనంతరం పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి పొత్తు కుదురుతుందా లేదా అని మున్సిపల్ ఓటర్లు బహిరంగా చర్చించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై రాజకీయం క్షణం క్షణం మారుతుంది. మున్సిపాలిటీలో 15వార్డులు ఉండగా, 8బిఆర్ఎస్, 6బీజేపీ, 1కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మెజారిటీకి ఒక అడుగు బిఆర్ఎస్ ముందజలో, బీజేపీ ఒక అడుగు వెనకంజలో ఉండడంతో, చైర్మన్ పీఠం కోసం పావులు కదుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.మెజారిటీ ఫిగర్ బిఆర్ఎస్ చేరుకోవడంతో అభ్యర్థులను కాపాడుకోవడానికి శుక్రవారం రాత్రి క్యాంపుకు తరలించారు.

*మెజారిటీ స్థానాలు లేకున్నా బిజెపి, కాంగ్రెస్ ములఖత్…?*

మెజారిటీ స్థానాలు లేకున్నా చైర్మన్ పీఠం కోసం బీజేపీతో ములాఖత్ అయినట్లు ఓటర్లు చర్చింకుంటున్నారు.ఒకే ఒక స్థానంలో కాంగ్రెస్ గెలుపొందడంతో 6స్థానాలు గెలిచిన బీజేపీకి కాంగ్రెస్ అభ్యర్థి మద్దతు తెలుపుతున్నట్లు కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీకి మద్దతు తెలిపితే బీజేపీ బలం 7కు పెరుగుతుంది. ఎక్స్ ఆఫీషియో ఓట్లతో బీజేపీ అభ్యర్థి చైర్మన్, కాంగ్రెస్ అభ్యర్థి వైస్ చైర్మన్ అయ్యేలా పావులు కదుపుతున్నట్లు మున్సిపాలిటీ వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతుంది.మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ బిజెపి పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లేనని జోరుగా చర్చలుజరుగుతున్నాయి. 15 వార్డులు ఉండగా బి ఆర్ ఎస్ 8, బిజెపి 6, కాంగ్రెస్ 1 కౌన్సిలర్లు గెలుపొందారు. మెజారిటీకి అడుగు దూరంలో నిలిచిన బిజెపి , కాంగ్రెస్ మద్దతు కోరడంతో అధిష్టానము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మున్సిపాలిటీ వ్యాప్తంగా ఓటర్లు జోరుగా చర్చించుకుంటున్నారు. బిజెపికి లభించిన ఆరు కౌన్సిల్ స్థానాలు, కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి, ఎంపీ మల్లురవి ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఎక్స్ అఫీషియ ఓట్లతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకోనున్నారు. ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆమనగల్లు మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియ ఓటు కోసం నమోదు చేసుకున్నారు.రేపటి ప్రమాణ స్వీకారంపై మున్సిపాలిటీ ప్రజలంతా ఎం జరుగుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…

Latest