- 11 మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్ల ఎన్నిక నేటికి
- ప్రకటించిన ఎస్ఈసీ
- కొందరికి అనూహ్యంగా వరించిన అదృష్టం
హైదరాబాద్, మహా : రాష్ట్రంలోని 11 మునిసిపాలిటీలకు ఛైర్ పర్సన్లు, వైస్ ఛైర్మన్ల పదవుల ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. పలు కారణాలతో ఎన్నికను వాయిదా వేశారు. మున్సిపాలిటీల్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్‌ల ఎంపికపై చాలా చోట్ల ఉత్కంఠ నెలకొంది. వాయిదా పడ్డ 11 మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు మంగళవారం జరుగుతాయి. ఎన్నిక వాయిదా పడిన మున్సిపాలిటీలు ఇల్లందు,
సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం,
డోర్నకల్, తొర్రూర్, జనగాంలు ఉన్నాయి. మంగళవారం ఈ 11 మున్సిపాలిటీల్లో ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. ఆలస్యానికి కారణాన్ని ఆయన ప్రస్తావించలేదు.
116 మునిసిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలోని 2,996 వార్డులకు ఫిబ్రవరి 11, 2026న ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు తర్వాత ఫిబ్రవరి 13న ఫలితాలు ప్రకటించారు. దీని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్లు, మునిసిపాలిటీల ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్లు ప్రమాణ స్వీకారోత్సవం, ఎన్నికలు జరిగాయి. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 ప్రకారం, ఎన్నికైన సభ్యుని పదవీకాలం ఎన్నికల తర్వాత మునిసిపాలిటీ మొదటి సమావేశం తేదీ నుండి ఐదు సంవత్సరాలు ఉంటుంది.
ఛైర్ పర్సన్లుగా ఇండిపెండెంట్లు
ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా కొన్ని మున్సిపాలిటీల్లో ఆసక్తికర సంఘటనలు జరిగాయి. అసలు రేసులోనే లేరు అనుకున్న స్వతంత్ర అభ్యర్థులు ఛైర్ పర్సన్లుగా ఎన్నికయ్యారు. బైంసా మున్సిపాలిటీలో బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, స్వతంత్రుల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి తూమెల్ల దత్తాత్రి ఛైర్మన్‌గా, ఖతుజా సిద్ధికి వైస్ ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. కామారెడ్డిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన ఇప్ప ఉమారాణిని ఛైర్ పర్సన్‌గా ఎంపికయ్యారు. ఫలితాల తర్వాత ఉమారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్ప ఉమారాణి ఛైర్ పర్సన్ పదవికి పోటీలో నిలిచి గెలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతుతో ఉమారాణి ఎన్నియ్యారు. వైస్ ఛైర్ పర్సన్‌గా బీఆర్ఎస్‌కు చెందిన కాసర్ల గోదావరిని ఎన్నుకున్నారు. ఇక ఆదిలాబాద్‌లో 45వ వార్డు నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా గెలిచిన అనూష బండారి ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. బీజేపీకి పీఠం దక్కకుండా కాంగ్రెస్ చేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. బండారి అనూషకు 11 మంది కాంగ్రెస్, ఐదుగురు బీఆర్ఎస్, ఆరుగురు ఎంఐఎం, ఐదుగురు ఇండి పెండెంట్లు సపోర్ట్ చేశారు. 21 మంది కౌన్సిలర్లతో క్యాంపు నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు షాక్ తగిలింది. ఇక్కడ అంచనాలు తలకిందుగా అయి అనూష ఛైర్ పర్సన్ అయ్యారు.








