Mahaa Daily Exclusive

  చైర్మన్ ఎన్నిక నేటికీ వాయిదా….

Share

  • చైర్మన్ ఎన్నిక నేటికీ వాయిదా….
  • చైర్మన్ ఎన్నిక ఓటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే రంగారెడ్డి…
  • సభ్యుల మధ్య వాగ్వాదం..సభలో గందరగోళం…
  • ఎన్నిక వాయిదా పడడంతో వెన్న దిరిగిన ఎమ్మెల్యే
  • ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఉత్కంఠత నెలకొంది…
  • నేటి చైర్మన్ ఎన్నికకు కౌన్సిలర్ యాదగిరి హాజరవుతారా..?
  • చైర్మన్ ఎన్నిక సులభతరం అవుతుందా..?

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో సోమవారం జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమావేశంలో, కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం, తీవ్ర గందరగోళానికి దారి తీసింది… మంగళవారానికి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో తెలిపారు… వాయిదా అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి వెళ్లిన ఎమ్మెల్యే రంగారెడ్డి, కాంగ్రెస్ బీఆర్ఎస్ బిజెపి కౌన్సిలర్లు… చైర్మన్ ఎన్నిక…లో 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి హాజరు కాకపోవడంతో సమావేశంలో జరిగింది, ఈ గందరగోళంతో రెండుసార్లు వాయిదా వేసినా, సభ్యుల మధ్య తీరు మారక, సభలో గందరగోళం నెలకొంది…. గందరగోళం మధ్య ఆర్డిఓ అనంతరెడ్డి, ఈ యొక్క ఎన్నికను నేటికి వాయిదా వేయడం జరిగింది… నేటి ఈ సమావేశానికి కౌన్సిలర్ ఆకుల యాదగిరి హాజర్ అవుతారా, చైర్మన్ ఎన్నిక సులభతరంగా జరుగుతుందా లేదా అనేది, వేచి చూడాల్సి ఉంది.

మున్సిపాలిటీలో ఎన్నడూ లేని రీతిలో చైర్మన్ ఎన్నిక.?..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 2014లో ఏర్పాటు జరిగింది. నాటి నుంచి 2020 వరకు రెండు పర్యాయాలు ఎస్సి రిజర్వేషన్ కావడంతో చైర్మన్ ఎన్నిక సులభంగా జరిగిపోయింది. ప్రస్తుతం జనరల్ రిజర్వేషన్ కావడంతో పోటీ తీవ్రతరమైంది. అగ్రకుల నాయకులు చైర్మన్ పదవి చేజికించుకోవాలని పోటాపోటీగా ముందుకు రావడంతో, బీసీ నినాదం తెరపైకి వచ్చింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా ఖానాపూర్ సీతారాంపేట్ శేరిగూడ గ్రామాలలో ఐదు వార్డులు ఉండగా, మున్సిపాలిటీ కేంద్రంలో 19 వార్డులు ఉండడంతో ఒకటి రెండు వార్డులు కలిగిన గ్రామాలకు చైర్మన్ పదవి ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, మున్సిపాలిటీ కేంద్రంలో 19 వార్డులు ఉన్న సభ్యులకు చైర్మన్ ఎందుకు ఇవ్వరు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

40 సంవత్సరాల రాజకీయ జీవితం….
40 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో కొనసాగుతున్న ఆకుల యాదగిరికి చైర్మన్ పదవి ఇవ్వాలనేది సభ్యుల ఆందోళన. దీంతో సోమవారం చైర్మన్ ఎన్నికల్లో ఆయన హాజరు కాకపోవడంతో సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొని గందరగోళం జరిగింది. ఎన్నికల అధికారి ఏమీ చేయలేని పరిస్థితిలో ఎన్నికను నేటికీ (మంగళవారం) వాయిదా వేయడం జరిగింది. నేటి ఈ ఎన్నికకు ఆయన హాజరవుతారా అనేది వేచి చూడాల్సి ఉంది.

నా భర్త ఆచూకీ తెలపండి… ఆకుల యాదగిరి భార్య…..
తన భర్తను కిడ్నాప్ చేశారని ఆకుల యాదగిరి భార్య, కొడుకు ఆందోళనకు దిగారు. అనంతరం ఆర్డీవో అనంతరెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొడుకు, మా ఇంటి వద్దకు వచ్చి, నా భర్త ఆకుల యాదగిరినీ క్యాంపుకు తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు….
సోమవారం ప్రమాణ శ్రీకారానికి 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి హాజరు కాకపోవడంతో అతని భార్య, కొడుకు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. నా భర్త లేకుండా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎలా చేస్తారని, ఎన్నికను వాయిదా వేయాలని, ఆర్డీవోతో ఆమె విన్నవించుకున్నారు.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు….
ప్రమాణ స్వీకారానికి ఆకుల యాదగిరి హాజరు కాకపోవడంతో పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ అతని భార్య, నా భర్త ఆచూకీ తెలపాలంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఫిర్యాదు అమ్ముకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు.
ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డికి వినత పత్రం అందజేసిన 19వ వార్డ్ సభ్యుడు ఆకుల యాదగిరి భార్య… ఆమె యొక్క వాంగ్మూలం ఆర్డిఓ తీసుకోవడం జరిగింది….
ఆందోళన చేపట్టిన ఆమెను, పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంటికి పంపించడం జరిగింది…

మున్సిపల్ కార్యాలయం పై రాళ్ల దాడి….
ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు..
మహేశ్వరం డిసిపి కె నారాయణరెడ్డి
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో.. చైర్మన్ వైస్ చైర్మన్ జరుగుతున్న సమయంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి జరగడం చర్చనీయాంశం అయింది..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయం వెనకాల నుండి పైకి రాళ్లతో దాడి చేసిన తెలియని దుండగులు. కార్యాలయం భవన అద్దాలు ధ్వంసమయ్యాయి.
దాడి చేసిన వ్యక్తి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోబడుతుందని, మహేశ్వరం డిసిపి కే నారాయణ రెడ్డి వెల్లడించారు….
కార్యాలయం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు… సోమవారం జరిగిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వై సుదర్శన్, మహేశ్వరం డిసిపి నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసిపి కేపీవి రాజు, సీఐ మహేందర్ రెడ్డి ,కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు…

Latest