Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ లో చేరిన ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ …. కండువా కప్పి స్వాగతించిన సుదర్శన్ రెడ్డి….

Share

ఆదిలాబాద్ . ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సరైన దేనని ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల పార్లమెంటు ఇంచార్జి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు .అదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన బండారి అనూష సతీష్ లు సోమవారం నిజమాబాదులోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు .వారిని ముందుగా అభినందించి శాలువాలతో సత్కరించారు .అనంతరం కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. తమది సెక్యులర్ పార్టీ అని ఇతర సెక్యులర్ పార్టీల మద్దతుతో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అదిలాబాదులో మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం దక్కించుకోవడం హర్షనీ యమన్నారు . ఇందుకు సహకరించిన కౌన్సిలర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు .అలాగే ఆదిలాబాద్ నేతలందరినీ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, ఆదిలాబాద్ డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, అశ్విన్ రెడ్డి ,పత్తి ముజ్జు, కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest