Mahaa Daily Exclusive

  కొడుకుపై దిగాలుతో దవఖాన పాలైన తల్లి.!

Share

  • కొడుకుపై దిగాలుతో దవఖాన పాలైన తల్లి.!
  • తన కొడుకును చూడాలని కోరిన ఆ తల్లి మనసు
  • మరి ఆ కొడుకు వస్తాడా?. ఆ తల్లిని చూస్తాడా.?

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
కొడుకు కనిపించడంలేదనే ఆందోళనకు గురైన ఆ తల్లి మనసు, దిగాలుతో దావఖాన పాలయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో మూడవ వార్డు నుంచి విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి దాసరి మురళీకృష్ణ, గత వారం రోజుల నుంచి బిఆర్ఎస్ శిబిరంలోనే ఉన్నారు. గత మంగళవారం చైర్మన్ ఎన్నిక ఉన్న సందర్భంగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన కౌన్సిలర్ మురళీకృష్ణను కలిసిన తన తల్లి, ఏ క్యాంపుకు వెళ్ళ వద్దంటూ తనను వారించిన తల్లి మాటను బేకాతరు చేస్తూ, చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోవడంతో తిరిగి బిఆర్ఎస్ క్యాంప్ కు వెళ్లిపోయాడు.. గత నాలుగు రోజులుగా తన కొడుకు కనిపించడంలేదనే ఆందోళనకు గురైన ఆ తల్లి మనసు, దిగాలుతో దావఖాన పాలయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు.
తన కొడుకును చూడాలనే ఆందోళనలో చెందిన ఆమె నిద్రాహారాలు మాని తీవ్ర అస్తవ్యస్తకు గురైనట్లు వైద్యులు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ దవఖానలో గత రాత్రి నుంచి చికిత్స అందిస్తున్నారు.

రాజకీయ నాయకులు పట్టుదలలకు పోయి, పార్టీల పేరుతో రాజకీయాలు చేస్తూ, క్యాంపుల పేరుతో కుటుంబ సభ్యులను వదిలేస్తూ, ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఏమయ్యారనే కనీసం పట్టింపు లేకుండా ఉండడం దారుణం అని పలువురు మండిపడుతున్నారు

Latest