Mahaa Daily Exclusive

  పట్నం బీఆర్ఎస్ కౌన్సిలర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు.!

Share

  • పట్నం బీఆర్ఎస్ కౌన్సిలర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు.!
  • పట్నం మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది.?
  • ఇద్దరు కౌన్సిలర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు.?
  • కౌన్సిలర్ కు రెండుచోట్ల ఓటు: ఆరోపిస్తున్న సంతోష్

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేయడం జరుగుతుందని, ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ఎన్నికల నియమావళి ప్రకారం ఒక వ్యక్తి ఒకే చోట ఓటు కలిగి ఉండాలని ఒకే చోట ఓటును వినియోగించుకోవాలని కానీ కొందరు ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని పలువురు వాపోతున్నారు.

ఎన్నికల నియమావళి వ్యతిరేక ఎన్నికను రద్దు చేయాలి….
ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిలర్ బుగ్గరాములు ఎన్నికను రద్దు చేయాలని, కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ప్రత్యర్థి సంతోష్. ఈనెల 11న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో 21వ వార్డుకు చెందిన కౌన్సిలర్ చిలకల బుగ్గరాములు, ఇబ్రహీంపట్నం మండలం, పెద్దతుండ్ల (పెత్తుల్ల) గ్రామపంచాయతీలో గత రెండు నెలల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికలలో తన ఓటును వినియోగించుకున్నారని, తనకు ఇదే గ్రామంలో రెండు ఓట్లు కలిగి ఉన్నాయని, మరొక ఓటు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కలిగి ఉండడాన్ని ఆరోపిస్తూ, ఒక వ్యక్తి ఒకే చోట ఓటు వినియోగించుకోవాలి అనే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని, తనకు మున్సిపాలిటీలో గ్రామపంచాయితీలో కలిపి మూడు ఓట్లు కలిగి ఉండడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ ఎన్నికలలో ఎన్నికైన తన ఎన్నికను రద్దు చేయాలని, తన జనసేన పార్టీ ప్రత్యర్థి సంతోష్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశాడు.

కౌన్సిలర్ పదవి కోసం కులాన్ని మార్చేశారు.?
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ నీలం శ్వేతపై బుధవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డికి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి చనమోని చంద్రకళ ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికలలో 23వ వార్డు నుంచి కౌన్సిలర్ గా గెలుపొందిన నీలం శ్వేత, ఓసీ వర్గానికి చెందిన వ్యక్తి, ఎన్నికలలో బీసీ కుల ధ్రువపత్రాన్ని సమర్పించి, బీసి మహిళా రిజర్వేషన్ కలిగిన వార్డులో పోటీ చేయడం జరిగిందని, నకిలీ కుల ధ్రువపత్రాలతో ఎన్నికల నామినేషన్ దాఖలు చేయడంపై, కలెక్టరేట్, ఆర్డిఓ, పోలీస్ స్టేషన్ కార్యాలయాల్లో, కాంగ్రెస్ ప్రత్యర్థి చంద్రకళ ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్ పదవి కోసం కులానే మార్చేశారని, సదరు కౌన్సిలర్ ఎన్నికను రద్దు చేయాలని చనమోని చంద్రకళ డిమాండ్ చేయడం జరిగింది.

వరుస ఆరోపణలలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు.?
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో నిలిచిన చైర్మన్ ఎన్నిక నిలిచిన నుంచి, పట్నం బీఆర్ఎస్ పార్టీకి వరుస ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారంటూ తన కుటుంబ సభ్యులు కోర్టుకెక్కడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం జరిగింది. బుధవారం మరో కౌన్సిలర్ నకిలీ కుల ధ్రువపత్రాలతో నామినేషన్ దాఖలు చేయడం చేసి ఎన్నికలలో గెలుపొందడం జరిగిందని తన ప్రత్యర్థి చనమోను చంద్రకళ ఆరోపిస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మరో కౌన్సిలర్ చిలకల బుగ్గరాములు పలుచోట్ల ఓటు కలిగి ఉండడం, గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో తన ఓటును వినియోగించుకున్నారు అంటూ ఆరోపిస్తూ, గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు తన ప్రత్యర్థి సంతోష్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఇద్దరు ప్రత్యర్ధులు, కౌన్సిలర్ల పై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళ ఎన్నికపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని వేచి చూడాల్సి ఉంది. అధికారులు కౌన్సిలర్ల పై చర్యలు తీసుకొని యెడల న్యాయస్థానాన్ని ఆశ్రయించి, న్యాయ పోరాటం చేయడం జరుగుతుందని ప్రత్యర్ధులు హెచ్చరించారు.

Latest