Mahaa Daily Exclusive

  దుకాణదారుల కారణంగానే ట్రాఫిక్ జామ్.?…

Share

  • దుకాణదారుల కారణంగానే ట్రాఫిక్ జామ్.?…
  • ఇరికిరుకు రోడ్డు ఇబ్బందుల్లో వాహనదారుడు
  • మంచాల్ రోడ్డులో వెళ్లాలంటే నరకయాతనే
  • రోడ్డు వెడల్పు పనులపై ఎమ్మెల్యే దృష్టి సారించాలి…
  • మున్సిపల్ కమిషనర్ ట్రాఫిక్ పోలీసులు చొరవచూపాలి
  • ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలి.. పట్నం ప్రజలు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం చౌరస్తా నుంచి మహంకాళి కమాన్ వరకు వెళ్లాలంటే, దుకాణదారుల కారణంగానే నరకయాతన పడుతున్నామన్న వాహనదారులు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం చౌరస్తా నుంచి మంచాల్, ఆరుట్ల, రాచకొండ నారాయణపురం వెళ్లే ప్రధాన రహదారి కావడం, అంతేకాకుండా ఈ దారిలో ప్రైవేటు హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉండడంతో తరచూ వాహనాలు వస్తూ వెళ్తూ రద్దీగా ఉంటుంది.. ఈ రోడ్డులో మహంకాళి కమాన్ వరకు వెళ్లాలంటే నరకయాతనకు గురవుతున్నామని వాహనదారులు వాపోతున్నారు.

దుకాణదారుల కారణంగానే ట్రాఫిక్ జామ్.?…
చౌరస్తా నుంచి రోడ్డుకు ఇరువైపులా ఇష్టానుసారంగా దుకాణదారులు, పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి తమ వస్తువులను షెల్టర్ బయట పెట్టడంతో, దుకాణం కోసం వచ్చిన వినియోగదారులు తమ వాహనాన్ని నడిరోడ్డుపై నిలపడంతో, ఇటూ అటు వెళ్లే వాహనాలు వెళ్లలేక ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోతున్నారు.. మున్సిపల్ కమిషనర్, ట్రాఫిక్ పోలీసులు కలిసి ఇప్పటికైనా దృష్టి సారించి, దుకాణం ముందు వేసిన టెంట్లను పెట్టిన వస్తువులను తొలగించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు వాహనదారులు కోరుచున్నారు.

అధికారుల నిర్లక్ష్యమా.? పాలకులే కారణమా.?…
మంచాల్ రోడ్డు విస్తరణ చేపట్టడానికి గతంలో అధికారులు కొలతలు తీసి, గత ప్రభుత్వంలో మార్కింగ్ వేయడం జరిగింది. ఇది జరిగి ఐదారు సంవత్సరాలు గడుస్తున్న, నేటికీ రోడ్డు విస్తరణ పనులు ఏమాత్రం జరగలేదు. ఈ రోడ్డు విస్తరణ పనులు నిలుచుపోవడానికి అధికారుల నిర్లక్ష్యమా.? పాలకుల కారణమా.? అనే ప్రశ్నతో పనులు జరగక ఈరోజు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనితోపాటు సాగర్ రహదారి కూడా రోడ్డున ఇరువైపులా కొలతలు తీసిన ప్రయోజనం లేకపోయింది. ఈనాటికి రోడ్డు వెడల్పు పనులు అలాగే మిగిలిపోయాయి. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వదిలి రోడ్డు విస్తరణ పనులు చేపట్టి, ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కల్పించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

రోడ్డు వెడల్పు పనులపై ఎమ్మెల్యే దృష్టి సారించాలి…
మంచాల్ రోడ్డు విస్తరణ పనుల గురించి స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష నిర్వహించి, రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోవడానికి గల కారణాలను తెలుసుకొని, ప్రత్యేక దృష్టి సారించి త్వరలో రోడ్డు వెడల్పు పనులను చేపట్టి, ట్రాఫిక్ సమస్యలను తొలగించాలని, పట్నం ప్రజలు ఎమ్మెల్యేను కోరుతున్నట్లు తెలిపారు.