Mahaa Daily Exclusive

  ఇంటర్ విద్యార్థులకు శుభాకాంక్షలు: టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

Share

హైదరాబాద్, మహా
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరీక్షలు ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు కీలకమైన మెట్టు అని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, ధైర్యంగా మరియు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు మానసిక బలం అందించి, ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని కోరారు. క్రమశిక్షణ, సమయపాలన, పునశ్చరణ వంటి అంశాలు విజయానికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితాలు దక్కాలని ఆకాంక్షిస్తూ, ప్రతి ఒక్కరూ ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యే భవిష్యత్తుకు బాటలు వేస్తుందని, ఈ పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితంలో కొత్త అవకాశాలకు నాంది కావాలని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.