Mahaa Daily Exclusive

  ఖానాపూర్ లో ఇందిరమ్మ చీరల పంపిణీ….

Share

  • ఖానాపూర్ లో ఇందిరమ్మ చీరల పంపిణీ
  • కౌన్సిలర్ భార్గవిరాజు చేతుల మీదుగా అందజేత

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రోత్సాహకంగా అందిస్తున్న ఇందిరమ్మ చీరలను, ఖానాపూర్ గ్రామంలో కౌన్సిలర్ భార్గవిరాజు పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని, పదవ వార్డు ఖానాపూర్ గ్రామంలోని మహిళలకు, కౌన్సిలర్ భార్గవి, ఏఎంసీ డైరెక్టర్ రాజు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ చీరలను అందజేశారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తున్న ఇందిరమ్మ చీరలను, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఆదేశాల మేరకు గ్రామంలోని మహిళలకు, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగిందని కౌన్సిలర్ భార్గవిరాజు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్, సాయిలు, సుదర్శన్, శ్రీకాంత్, గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.