రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం (టియుఎఫ్) అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ అన్న పిలుపుమేరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులుగా బుట్టి మహేందర్ ను నియమించడం జరిగింది. టియుఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంత యాదిరెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బోసుపల్లి వీరేష్ కుమార్ చేతుల మీదగా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం టియుఎఫ్ అధ్యక్షులుగా నియమితులైన బుట్టి మహేందర్ కు నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బుట్టి మహేందర్ మాట్లాడుతూ… నాపై నమ్మకం ఉంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంత యాదిరెడ్డి గారికి మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బోసుపళ్లి వీరేష్ కుమార్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల ఉద్యమకారులకు ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేశారు. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదని, ప్రభుత్వంపై పోరాటం చేసిన ఉద్యమకారులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని మహేందర్ అన్నారు.








