Mahaa Daily Exclusive

  102 మంది జీవిత ఖైదీలకు మోక్షం…

Share

  • 102 మంది జీవిత ఖైదీలకు మోక్షం
  • లైన్ క్లియర్ చేసిన స్టాండింగ్ కమిటీ
  • కెబినెట్ ఆమోదం, గవర్నర్ సంతకమే తరువాయి
  • ఆరు నెలలుగా ఎదురు చూస్తున్న జీవిత ఖైదీలు

కుషాయిగూడ, మహా : జీవిత ఖైదీల విడుదలపై తెలంగాణ హోం శాఖ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సి.వి. ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లా శాఖ కార్యదర్శి బి. పాపి రెడ్డి, తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా పాల్గొని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం తెలంగాణ జైళ్లలో మగ్గుతున్న జీవిత ఖైదీల విడుదల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మొదలుపెట్టింది ఇందులోనే భాగంగా తెలంగాణ హోంశాఖ జైళ్ళ శాఖ
రాష్ట్రంలోని జీవిత ఖైదీల ముందస్తు విడుదల అంశంపై విస్తృతంగా చర్చించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కేసులను పరిశీలించి మొత్తం 102 మంది జీవిత ఖైదీలు ముందస్తు విడుదలకు అర్హులని కమిటీ గుర్తించింది. వీరిలో 96 మంది పురుషులు, 6 మంది మహిళా ఖైదీలు ఉన్నారు.

స్టాండింగ్ కమిటీ చేసిన సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ అంశంపై త్వరలో రాష్ట్ర కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకున్న అనంతరం గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత విడుదల ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో 213 మంది జీవిత ఖైదీలను ముందస్తుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదలైన ఖైదీల పునరావాసం కోసం జైళ్ల శాఖ చర్యలు చేపడుతోంది. విడుదలైన ఖైదీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో నుండి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది కెసిఆర్ ప్రభుత్వం విడుదలైన ఖైదీలను అక్కున చేర్చి పెట్రోల్ బంకులలో ఉపాధి అవకాశాలు కల్పించారు మళ్లీ నేల ప్రవృత్తిలోకి అడుగుపెట్టకుండా ఖైదీలకు ఉపాధి ఉద్యోగం అవకాశాలు జైళ్ల శాఖ ఉన్నత అధికారులు కల్పిస్తున్నారు క్షమాభిక్ష కోసం ఎన్నో ఏళ్లుగా జీవిత ఖైదీలు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించకపోవడంతో కొంతమంది ఖైదీల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు జైళ్లలో మగ్గుతున్న జీవిత ఖైదీలను ప్రతి ఏటా పండుగ పర్వదినాలైన మూడుసార్లు క్షమాభిక్ష ధార విడుదల చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విడుదల చేసింది క్షమాభిక్ష అనేది ఖైదీల హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆరు నెలల క్రితం తెలంగాణ జైళ్ల శాఖ నుండి సుమారు 92 మంది ఖైదీల విడుదల జాబితా లిస్టు ను తెలంగాణ హోంశాఖకు పంపించారు. హోం శాఖలో ఖైదీల విడుదల జాబితా లిస్ట్ పెండింగ్ లో ఉంది ఎప్పుడు విడుదలవుతామని ఖైదీలు ఎదురుచూస్తున్నారు. త్వరలో ఖైదీల విడుదలకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది ఈ సమావేశంలో జైళ్ల శాఖ ఐజీలు ఎర్రంశెట్టి రాజేష్, మురళీ బాబు, వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్, హైదరాబాద్ రేంజ్ డీఐజీ శ్రీనివాసరావు, చంచల్‌గూడ సెంట్రల్ జైలు పర్యవేక్షణ అధికారి నవాబ్ శివకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.