Mahaa Daily Exclusive

  పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు తప్పనిసరి: నందికందిలో ఉచిత టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ స్రవంతి

Share

పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణీకలు వేయించాలి
సర్పంచ్ స్రవంతి విజయభాస్కర్ రెడ్డి
మహా: సంగారెడ్డి ప్రతినిధి:

పశుపోషకులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారి సంతోష్ కుమార్ అన్నారు.శనివారం మండల పరిధిలోని నంది కంది గ్రామంలో స్థానిక సర్పంచ్ స్రవంతి విజయభాస్కర్ రెడ్డి తో కలిసి ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణకు ఏటా రెండుసార్లు,ప్రతి 6 నెలలకు ఒకసారి వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు.
పశువులకు గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైందని, ఈ వ్యాధి సోకిన పశువుల నోటిలో,కాళ్లలో పుండ్లు ఏర్పడి మేత మేయక, నడవలేక నీరసిస్తాయన్నారు. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పడిపోతుందన్నారు. వ్యాధి సోకిన పశువులకు చికిత్స చేయకుంటే మరణిస్తాయన్నారు. అందుకే ముందుగానే నివారణ టీకాలు వేయించుకోవాలని కోరారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున పశువులను ఎండబారి నుండి కాపాడుకోవాలని, స్వచ్ఛమైన త్రాగునీరు, మేత అందించాలని సూచించారు. కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది సుజాత, అరిఫ్, బబితా, లింగమయ్య రమేష్ లు పాల్గొన్నారు.