Mahaa Daily Exclusive

  కొండాపూర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

Share

 

మహా: సంగారెడ్డి ప్రతినిధి :

కొండాపూర్ లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS) నిధుల ద్వారా రూ.8 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ,అలగే రూ.పది, పది లక్షల తో రెండు మహిళల సమైక్య భానాలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు గ్రామస్తులు డప్పు చప్పులతో, పుష్ప గుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. గ్రామాల్లో మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు సీసీ రోడ్ల నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మల్ల గౌడ్, మాణిక్ ప్రభు, పాండు రంగం, కొండాపూర్ సర్పంచ్ స్రవంతి అమరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ రుక్మొద్దీన్, సత్యానందం, పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.