Mahaa Daily Exclusive

  మమతకు ఈసీ షాక్….

Share

  • మమతకు ఈసీ షాక్
  • కోడ్ వచ్చిన వెంటనే కార్యరంగంలోకి
  • కీలక విభాగాల్లో అధికారుల బదలీ

మహా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకీ ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది ఎన్నికల కోడ్ వచ్చిన కొద్ది గంటల్లోనే ఎన్నికల కమిషన్ పలు కీలక చర్యలు తీసుకుంది. ఎన్నికలు సజావుగా జరగడానికి,నిష్పక్షపాతంగా నిర్వహించడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని పలువురు ముఖ్యమైన అధికారులను బదిలీ చేసింది

చీఫ్ సెక్రటరీ,హోం సెక్రటరీలను తొలగింపు

ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ,హోం సెక్రెటరీ ఇద్దరినీ ఆ పదవుల నుండి తక్షణమే తొలగించాలని ఆదేశించింది. ఎన్నికల సమయంలో రాష్ట్ర పరిపాలన తటస్థంగా ఉండాలి. అయితే గత ఎన్నికల్లో జరిగిన హింసను సరిగ్గా నియంత్రించలేదనే ఆరోపణలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఎస్ఐఆర్ సమయములో ఎన్నికల విధులు సరిగా నిర్వహించలేదు అని 22 మంది అధికారులపై శాఖా పర చర్యలు తీసుకోండి అని ఈసీ ఆదేశిస్తే చర్యలు తీసుకోలేదు అని వీరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయం ఈసీ సుప్రీం కోర్టుకు కూడా చెప్పింది.