మహా : సంగారెడ్డి :
భైంసా లో నిర్వహించిన కేలో ఇండియా లో గోల్డ్ మెడల్ సాధించిన నందిగారి సహస్ర ను వారి తల్లి దండ్రులు సంతోష్ మంజుల ను మంగళవారం సదాశివపేట 6వ వార్డు కౌన్సిలర్ మాణెమ్మ, బిఆర్ఎస్ నాయకులు నాగుల విజయ్ కుమార్ లు శాలువాతో సన్మానించి అభినందించారు. అనంతరం కౌన్సిలర్ నాగుల మానెమ్మ మాట్లాడుతూ సహస్ర భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే వీరశైవ సంఘం ఆధ్వర్యంలో సహస్రను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం జిల్లా గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ స్వామి, ప్రధాన కార్యదర్శి కె నురేందర్, ఉపాధ్యక్షులు HR మధు, గాండ్ల కృష్ణ, సంగిశెట్టి, రమేష్, బసవరాజ్, విజయ్ కుమార్, స్వరూప, వీరమని తదితరులు పాల్గొన్నారు.
Post Views: 8








