మహా :సంగారెడ్డి ప్రతినిధి :
పరాభవ నామ తెలుగు సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని సదాశివపేట మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా.రామకృష్ణను ఉగాది విశ్వ విఖ్యాత మహోన్నత జాతీయ పురస్కారం 2026కు ఎంపిక చేసినట్లు మనం ఫౌండేషన్ ఫౌండర్ మరియు చైర్మన్ చక్రవర్తి తెలిపారు.ఈ మేరకు రామకృష్ణ కు ఆహ్వానం పంపించారు.
ఈ జాతీయ పురస్కారాన్ని రామకృష్ణ ఈ నెలలో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగే సభలో ప్రముఖుల చేతుల మీదుగా అందుకుంటారని అన్నారు.విద్య, సామాజిక సేవా రంగం లో రామకృష్ణ సేవలకు ఈ పురస్కారం అందిస్తున్నట్లు తెలియజేశారు.
Post Views: 3








