ఆస్ట్రియాలోని తెలుగు Telugu sangam ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు మార్చి 21, 2026న ఘనంగా నిర్వహించబడి విజయవంతంగా ముగిశాయి.
కార్యక్రమం సంప్రదాయ పూజలతో ప్రారంభమై, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ నృత్యాలు, గాన కార్యక్రమాలు, నాటికల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న పిల్లలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా సంప్రదాయ ఉగాది వంటకాలు నిలిచాయి. పులిహోర, బొబ్బట్లు, గారెలు, ఉగాది పచ్చడి వంటి రుచికరమైన వంటకాలను అందించారు. ఇవి అందరికీ స్వదేశపు రుచిని గుర్తు చేశాయి.
ఈ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రజలు పరస్పరం కలుసుకుని స్నేహబంధాలను బలోపేతం చేసుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, వాలంటీర్లు మరియు పాల్గొన్న అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆస్ట్రియాలోని తెలుగు సమాజ ఐక్యత, సంస్కృతి పట్ల గౌరవాన్ని ఈ ఉగాది వేడుకలు మరోసారి ప్రతిబింబించాయి.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో Telugu Sangam Austria అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత కోమటి రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీమతి మమత ఆలల, ఖజానాదారు (Treasurer) శ్రీ రాజ్‌కుమార్ బిల్లా కీలక పాత్ర పోషించారు.
కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను మీడియా కోఆర్డినేటర్ శ్రీ మనోజ్‌కుమార్ సమన్వయం చేసి పంపించారు.








