Mahaa Daily Exclusive

  గంజాయి మొక్కను పీకి పారేశారు.. పెబ్బేరు సంతను కాపాడే బాధ్యత నాదే: ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్

Share

  • పెబ్బేరు సంతపై ఈగ వాలనివ్వకుండా
    చూసుకునే బాధ్యత నాది
  • గంజాయిమొక్కతోనే వనపర్తికి సమస్యలు
  • వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్
  • వనపర్తి, మహా

పెబ్బేరు సంత వివాదం దేవాదాయ శాఖకు పూజారులకు మధ్య నడుస్తోందని, పెబ్బేరుసంతను కాపాడే బాధ్యత తనదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డి గారితో కలిసి ఆయన మాట్లాడారు. వనపర్తి చరిత్రలో సురవరం నుంచి చిన్నారెడ్డి వరకు ఎమ్మెల్యేలంతా తులసి మొక్కలుగా పూజింపబడితే పదేళ్ల నియంత పాలన చేసిన ఒకే ఒక్కడు నిరంజన్ రెడ్డి మాత్రం గంజాయి మొక్కల తయారయ్యాడని విమర్శించారు.
అలాంటి గంజాయి మొక్కను పీకి అవతల పడేయాలని వనపర్తిని కాపాడుకుందాం వనపర్తిని మార్చుకుందామని 2023 లో జరిగిన ఎన్నికల్లో ప్రజలను కోరితే పీకి అవతల పారేశారని, ఎమ్మెల్యే ఎంపీ గ్రామ సర్పంచ్ మున్సిపల్ కౌన్సిలర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీ సాధించిందని ఆ రిజల్ట్స్ తో మైండ్ దొబ్బి కొంతమంది పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అలాంటి మాటలు తమకు కూడా మాట్లాడడానికి వచ్చని, తాము కూడా వనపర్తి గడ్డపైనే పుట్టామన్నారు. వంద సంవత్సరాలుగా వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించిన ఈనామ్ భూమి అని అందరికీ తెలుసునని అప్పటినుంచి ఇప్పటివరకు పెబ్బేరు సంత ప్రశాంతంగా కొనసాగిందన్నారు. 1973 లో ఒక ప్రొసీడింగ్ వచ్చిందని 392 సర్వే నెంబర్లు 15 ఎకరాలు, సర్వేనెంబర్ 405 లో 15 ఎకరాల భూమి మొత్తం 30 ఎకరాల 19 గుంటలు వేణుగోపాల స్వామి దేవుడిపై ఆయన దూపదీప నైవేద్యాల కోసం కేటాయించబడి ఉన్నదని, ఆ గుడి ద్వారా వచ్చే ఆదాయంతో పూజారులు వాళ్ళ జీవనాన్ని కొనసాగించేందుకు కేటాయించారు అని తెలియశారని, ఈ భూమికి సంబంధించి మహబూబ్ నగర్, గద్వాల ఆర్డీవోలు సైతం ఈ భూమి పూర్తిగా వేణు గోపాల స్వామి ఆలయానికి సంబంధించింది అని సూచిస్తూ ప్రభుత్వ పరమైన ప్రోసిడింగ్ ఇవ్వడం జరిగిందన్నారు.
పెబ్బేరు సంత 2014 వరకు ఎంతో ప్రశాంతంగా కొనసాగిందని..100 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న ఆ సంతస్థలం ఈ గంజాయి మొక్క కు ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ పదవి రాగానే వివాదాస్పదంగా మార్చారని మేఘారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెబ్బేరు సంతను కాపాడుతామన్నారు.
…..