- మాల్ గ్రామపంచాయతీ వార్డు సభ్యురాలికి అవమానం.?
- కార్యదర్శి వ్యవహారమే ఇందుకు కారణం.!
- కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన వార్డు సభ్యురాలు స్వాతి
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
మాల్ గ్రామపంచాయతీ ఎదుట వార్డ్ సభ్యురాలు స్వాతి నిరసన తెలిపారు. ఈరోజు శనివారం రంగారెడ్డి జిల్లా, మాల్ గ్రామపంచాయతీలోని ఒకటవ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అదే వార్డుకు చెందిన వార్డ్ సభ్యురాలికి, పంచాయతీ కార్యదర్శి రాజు సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టడంపై ఒకటవ వార్డు సభ్యురాలు స్వాతి నల్ల రిబ్బన్‌తో కళ్ళకు గంతలు కట్టుకొని, కార్యదర్శి వ్యవహారం పట్ల మాల్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట మరి కొందరితో కలిసి ఆందోళన చేస్తూ నిరసన తెలిపారు. తనకు చెందిన వార్డులో అధికారిక కార్యక్రమం చేపట్టి తనకు సమాచారం ఇవ్వలేదంటూ, తనను అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి వ్యవహరించిన తీరు పట్ల పై అధికారులను కలిసి జరిగిన విషయాన్ని తెలియడం జరుగుతుందని ఆమె అన్నారు.







